Monday, August 18, 2014

మార్కెట్లో అసుస్ జెన్‌ఫోన్ 5.. 5 బెస్ట్ డీల్స్

వ్యక్తిగత కంప్యూటర్ల తయారీ రంగంలో అంతర్జాతీయంగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న అసుస్ (Asus) ఇటీవల ఇండియన్ మార్కెట్లో తన జెన్‌ఫోన్ సిరీస్ నుంచి మూడు స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో విడుదల చేసింది. జెన్‌ఫోన్ 6, జెన్‌ఫోన్ 5, జెన్‌ఫోన్ 4 వేరియంట్‌లలో విడుదలైన ఈ మూడు ఫోన్‌లను మొదటి నాలుగు రోజుల అమ్మకాల్లో భాగంగా 40,000 యూనిట్‌ల వరకు అసుస్ విక్రయించగలిగింది. కొద్దిరోజుల సుధీర్ఘ విరామం తరువాత అసుస్ జెన్‌ఫోన్ 5 ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ వద్ద రూ.10,000 అత్యుత్తమ ధర పై లభ్యమవుతోంది. మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి. వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి. అసుస్ జెన్‌ఫోన్ 5 ఫీచర్లు: 5 అంగుళాల కెపాసిటివ్ మల్టీటచ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో, 2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ఇంటెల్ ఆటమ్ జెడ్2580 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ అప్‌గ్రేడబుల్), జెన్ యూజర్ ఇంటర్‌ఫేస్, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఇంటర్నల్ మెమెరీ వేరియంట్స్ (8జీబి, 16జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్), 2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

No comments: